KRNL: వెల్దుర్తి మండలం ఎల్.బండ గ్రామానికి చెందిన కౌసల్య భాయి బీసీసీఐ ఆధ్వర్యంలో జరగబోయే అండర్-19 ఉమెన్స్ వన్డే ట్రోఫీకి ఎంపికయ్యారు. ఈ టోర్నీ డిసెంబర్ 13 నుంచి 21 వరకు ముంబైలో జరగనుంది. కర్నూలులోని శిక్షకుడు శేఖర్ వద్ద కౌసల్య భాయి క్రికెట్ మెలకువలు నెర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.