ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామ సమీపంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న బోర్లకుంట జాతర ఆదివారంతో ముగిసింది. సెలవు దినం కావడంతో నీపాని, గొల్లగట్, తాంసి(కే) గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దర్గా వద్ద గల దావల్ మాలిక్ బాబాను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.