NZB: ఎడపల్లి మండలం యర్పైకు చెందిన మీనకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో జానకంపేట వద్ద ఆమెకు పురిటినొప్పులు అధికమవడంతో సిబ్బంది అంబులెన్సులో ప్రవసవం చేశారు. ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.