ప్రకాశం: పొన్నలూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీడీవో సుజాత ఉపాధి హామీ పనులపై సమావేశం నిర్వహించారు. మండల పరిధిలో నిర్మాణం జరుగుతున్న పశువుల షెడ్లను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుధాకర్, టీఏలు, ఎఫ్ఎలు, సిబ్బంది పాల్గొన్నారు.