TG: డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఓయూని బెస్ట్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే కొత్తవి నిర్మించాలని అధికారులకు సీఎం సూచించారు.