ASR: జీకేవీధి మండలం ఏబులంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గ్రామానికి చెందిన రుత్తల సత్తిబాబు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు ఆగకుండా పారిపోయారని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.