AP: వరుస తుఫాన్లు, వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. మొంథా తుఫాన్, దిత్వా తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, సబ్సిడీ ఏదీ ఇవ్వలేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.