AKP: రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 18 ఏళ్లు పైబడిన గిరిజనులకు ఈనెల 8వ తేదీన ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పి. శైలజ తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో కబడ్డీ, డెమో గేమ్, పరవాడ సంస్కృతి గ్లోబల్ స్కూల్లో ఆర్చరీ పోటీలు, పెసారన్ మారథాన్(21.5 కి.మీ) రేబాక నుండి దేవిపురం వరకు నిర్వహిస్తామన్నారు.