NLG: మిషన్ వాత్సల్య పథకం అమలులో భాగంగా చిట్యాలలోని 1 నుంచి 6 వార్డుల్లో వార్డు స్థాయి బాలల సంరక్షణ కమిటీ సమావేశాలు శనివారం నిర్వహించారు. కమిటీల బాధ్యతలను అధికారులు తెలియజేశారు. చైల్డ్ ప్రొటెక్టివ్ అధికారి రాము మాట్లాడుతూ .. లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, అక్రమ దత్తత, శిశు విక్రయాలు, బాలల సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని కమిటీలకు సూచించారు.