సత్యసాయి: మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ టీడీపీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో మంత్రి సవిత శనివారం ముఖాముఖి నిర్వహించారు. ముందుగా స్వయం సహాయక సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్లను మంత్రి పరిశీలించారు. గ్రామీణ మహిళల అభివృద్ధిలో స్వయంసహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.