VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ శనివారం కీలక రైల్వే ప్రాజెక్టులను పరిశీలించారు. విశాఖపట్నం–గోపాలపట్నం, వడ్లపూడి–గేట్ జంక్షన్ మధ్య జరుగుతున్న 3వ, 4వ లైన్ పనుల పురోగతిని ఆన్సైట్లో తనిఖీ చేశారు. సింహాచలం స్టేషన్లో అమృత్ భారత్ పునరాభివృద్ధి పనులను కూడా సమీక్షించి నిర్మాణం, సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు.