BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఓంప్రకాష్, స్థానిక నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని అందించి బడుగు వర్గాలకు న్యాయం జరిగేలా చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.