నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ప్రజా ఫిర్యాదు విభాగంలో విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లిఫ్ట్ ను బాగు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.