సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఘోరంగా విఫలమవుతున్న ప్రసిద్ధ్ కృష్ణ చివరి వన్డేలో మాత్రం అదరగొడుతున్నాడు. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు భారీ షాక్ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న బ్రీట్జ్కీ(24), గత మ్యాచ్ సెంచరీ హీరో మార్క్రామ్ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం SA 29 ఓవర్లలో 176 పరుగులు చేసింది.