అల్లూరి: కొయ్యూరు మండలం ఎం.మాకవరం సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పెన్షన్ సొమ్ముతో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెన్షన్ సొమ్ము రూ.2 లక్షల 88వేలు కుటుంబ సభ్యుల నుంచి ఎస్సై పీ.కిషోర్ వర్మ రికవరీ చేసి శనివారం తమకు అందజేశారని ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. ఈ సొమ్మును సెర్ప్ ఖాతాకు చలానా ద్వారా జమ చేశామన్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌పై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.