E.G: డిసెంబర్ 8న నిడదవోలు SVR ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ ఉత్తీర్ణులై 19 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని వివరించారు.