MBNR: మిడ్జిల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏళ్ల తరబడి బకాయి ఉన్న ఇంటి పన్నులు భారీగా వసులయ్యాయి. నామినేషన్ వేసే అభ్యర్థులు, వారిని బలపరిచే వ్యక్తుల పన్నులు బకాయి లేకుండా ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో దోనూర్ రూ.42,000, రాణిపేట రూ.41,000, వల్లభరావు పల్లి రూ.33,500 పన్ను వసూలైనట్లు గ్రామాల కార్యదర్శులు వెంకటేష్, సుదర్శన్ తెలిపారు.