గుంటూరు: నగరంపాలెం రామిరెడ్డినగర్కు చెందిన సత్యన్నారాయణ గత నెల 30న ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదని కుమారుడు కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువుల వద్ద, గ్రామాల్లో వెతికినా సమాచారం దొరకలేదని తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సత్య నారాయణను గుర్తించిన వారు సమాచారాన్ని ఇవ్వాలని పోలీసులు ప్రజలను అభ్యర్థించారు.