PLD: బెల్లంకొండ మండలం పాపాయపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.