రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురైతున్నప్పటికీ.. భారత్- రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతేడాది భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12 శాతం పెరిగి రికార్డు సృష్టించిందని అన్నారు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.