WNP: చిన్నంబావి మండల కేంద్రంలోని బెక్కెం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి బొందిలి కమలాబాయి నామినేషన్ వేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు లేనందున బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.