JGL: సారంగాపూర్ మండలంలోని పెంబట్లశ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం డిస్కవర్, స్కూటీలు రెండు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. దీంతో బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామానికి చెందిన మంజుల తలకు గాయాలయ్యయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సై గీత ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.