KNR: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఈ సందర్భంగా అలుగునూర్ చౌరస్తా నుంచి డీసీసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి నారాయణ సహా పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.