NTR: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. డిసెంబర్11-15వరకు సేవలందించే గురు భవానీలు తప్పనిసరిగా గుర్తింపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం Google PlayStore BhavaniDeekshalu యాప్ అందుబాటులో ఉందని, గుర్తింపు పత్రాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు.