NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి చిరుమర్తి ధర్మయ్య ప్రచారంలో దూసుక పోతున్నాడు. శుక్రవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు.