VZM: విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు, విలువలు, నైపుణ్యాలు కూడా అందించాలని ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. డెంకాడ మండలం అక్కివరం ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు.