KMM: ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో ఖమ్మం జిల్లా బాలికలు అద్భుత ప్రతిభ కనబరచి మూడో స్థానాన్ని సాధించారు. విజయం సాధించిన జట్టును శుక్రవారం ఖమ్మంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.