TPT: శ్రీకాళహస్తిలో ఈనెల 10న జరిగే ఏడు గంగమ్మల జాతర కమిటీ సభ్యులతో శుక్రవారం శ్రీకాళహస్తి డీఎస్పీ కే. నరసింహమూర్తి సమావేశం అయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి గంగమ్మ కమిటీ సభ్యులు పోలీసులు నిబంధనలు పాటించాల్సిందేనని, జాతరలో తీసుకోవలసిన ఏర్పాట్లు, నిబంధనలను వివరించారు. నేరాలు జరగకుండా ప్రతి కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని తెలిపారు.