ADB: 18 సంవత్సరాలు నిండిన ప్రజలందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఇచ్చోడ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. విలువైన ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని ప్రజలను కోరారు.