TG: హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం. విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు లంచం ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.