MBNR: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 190 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 12420 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 14.87 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.