ATP: గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రైల్వే కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 31న చలో విశాఖ పోస్టర్స్ ఆవిష్కరించారు. సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. రైల్వేలను ప్రైవేటీకరించొద్దు, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి, రైల్వే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.