AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత మహిళా క్యాంటీన్‌ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. కేఎల్ పురం గ్రామానికి చెందిన ఓం సాయి డ్వాక్రా గ్రూపు సభ్యులు నిర్వహిస్తున్న క్యాంటీన్ అందరికీ ఉపయోగపడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రోగులు సహాయకులకు ఉపయోగపడే విధంగా క్యాంటీన్ నిర్వహణ ఉండాలన్నారు.