MBNR: జిల్లా కేంద్రంలోని దేవుని గుట్టపై వెలసిన కంఠమహేశ్వర స్వామి దేవాలయ మండల పూజా కార్యక్రమానికి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.