KMM: తన కుమారుడిపై కబ్జా కేసు నమోదైన వార్తలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ‘నా కొడుకుపై కేసు నమోదైంది నిజమే. చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసినట్లు రుజువైతే నా కొడుకైనా, నేనైనా శిక్ష అనుభవించక తప్పదు’ అని మంత్రి స్పష్టం చేశారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని తెలిపారు.