JGL: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇవాళ కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఎన్నికల నియమావాలిని కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలనీ సిబ్బందిని ఆదేశించారు.