GDWL: కార్మికుల వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఐఎఫ్టీయూ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేసిన ఆయన, డిసెంబర్ 8న జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్లో మహాసభను నిర్వహిస్తామన్నారు.