NLG: అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుతో బీటెక్ విద్యార్థి సర్పంచ్‌గా బరిలో నిలిచారు. నార్కెట్ పల్లి మండలం జువ్విగూడెం సర్పంచ్ అభ్యర్థి చింత అనిల్ కుమార్ గ్రామాభివృద్ది కోసం సర్పంచ్‌గా పోటీ చేశాడు. తనకు ఓటు వేసి గెలిపించాలని శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. అధిక నిధులు సాధించి అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.