E.G: సీతానగరం మండలం రఘుదేవపురం హైస్కూల్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులలో నైపుణ్యం పెంచడానికి, సృజనాత్మకత పెంచడానికి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్ ఉపయోగపడుతుందన్నారు.