అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. అయితే ఈ మూవీలో మహేష్ బాబు ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న వార్తలపై దర్శకుడు అజయ్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. ఈ మూవీలో కొత్త నటీనటులు తీసుకోవాలని అనుకున్నానని, జయకృష్ణ, రాషా థడానీ భాగమవుతారని ఊహించలేదని తెలిపాడు. ఇందులో మహేష్, రవీనా టాండన్ ప్రమేయం లేదని, జయకృష్ణ కుటుంబానికి కథ కూడా తెలియదన్నాడు.