మెంతుల్లోని ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్ డి, విటమిన్ సి పోషకాలు ఉంటాయి. మెంతి గింజలు శరీరంలోని రక్తహీనతను తొలగించడంలో పనిచేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఔషధం. మెంతులు పేగుల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.