AP: విద్యార్థుల్లోని బలాలు, బలహీనతలను గుర్తించి వాటికి తగ్గట్టుగా వారిని ట్రైన్ చేయాలని తల్లిదండ్రులు, టీచర్లకు CM చంద్రబాబు సూచించారు. శ్రీకాకుళం భామినిలో జరుగుతున్న మెగా PTMలో పాల్గొన్న ఆయన.. పిల్లల్లో తెలివితేటలు బాగున్నాయని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామన్నారు.