ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో పలు విమానాయాన సంస్థల విజ్ఞప్తితో పైలట్ల విధులపై ఆంక్షలను ఎత్తివేస్తూ.. DGCA నిర్ణయం తీసుకుంది. అలాగే పైలట్లకు వారంపాటు విశ్రాంతి నిబంధనను కూడా తొలగించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో ఇండిగో సంస్థకు భారీ ఊరట లభించింది. ఈ క్రమంలో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.