TPT: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 10:35కు చేరుకుని 11:05కు బయల్దేరాల్సిన ఇండిగో విమానం గంటన్నర పైగా ఆలస్యమైంది. తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కాకుండా చెన్నై వైపు దారి మళ్లింది. నిన్న కూడా ఇదే పరిస్థితి ఎదురై తిరిగి తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఇండిగో ఉద్యోగుల సమ్మె కారణంగా అన్ని ఫ్లైట్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి.