HYD: మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అందులో భాగంగా మెట్రో రైల్ ఆడిటింగ్ను అధికారులు వేగంగా చేస్తున్నట్లు సమాచారం. అసలు మెట్రో రైళ్లు ఎన్ని ఉన్నాయి? వాటి సర్వీసు ఇంకా ఎంత కాలం? డిపోలు, పనిచేసే సిబ్బంది, అధికారుల సంఖ్య, వారి వేతనం.. ఇలా అన్ని విషయాలను ఆడిటింగ్ అధికారులు కూలంకుషంగా ఆరా తీస్తున్నారు.