KRNL: అందరి భాగస్వామ్యంతో విద్యార్థులు చదువులో మార్పులు తేవొచ్చని MEO ఉస్మాన్ బాషా స్పష్టం చేశారు. శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం సందర్భంగా పెద్దకడబూరు మండలం మురవణి ZPHS పాఠశాలలో తల్లిదండ్రులకు సూచనలు చేశారు. తల్లితండ్రులు విద్యార్థులపై నిఘా ఉంచి.. చదువులో అన్ని సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.