వికల్ప్ పేరుతో మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. ‘దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారు. లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పాడనేది అవాస్తవం. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణం. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రక్టర్ కారకులు’ అని తెలిపారు.