PDPL: ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి అన్నారు. ముత్తారం పోలీస్టేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంపల్లి, ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేసనపల్లి గ్రామాల్లో ఎన్నికల కోడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరగాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలపై ఫిర్యాదు చేయాలన్నారు.