యాషెస్ రెండో టెస్టులో సెంచరీ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(138*) ఆస్ట్రేలియాపై అద్భుత రికార్డ్ నెలకొల్పాడు. ఆసీస్తో డే & నైట్ టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ పాక్ ప్లేయర్ అసద్ షఫిక్(137) పేరిట ఉండేది. ఇక ఈ లిస్టులో డూప్లెసిస్(118*), యాసీర్ షా(113 PAK), స్టీఫెన్ కుక్(104 SA) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.