PLD: అమరావతి మండలం పెదమద్దూరు బ్రిడ్జి తలనొప్పిగా మారింది. గత YCP ప్రభుత్వంలో మొదలుపెట్టిన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి నిర్మాణ పనులు సంవత్సరం పాటు నిలిపివేశారు. తిరిగి ఇటీవల నిర్మాణ పనులు మొదలు కాగా.. అవి కూడా నత్తనడకన సాగుతున్నాయి.